: రణ్ వీర్ కి అభిమానిని అంటున్న కొత్త హీరో


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాను నిర్మిస్తున్న తాజా చిత్రం ద్వారా వెండితెరకు కొత్త జంటను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. జాకీష్రాఫ్ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన 'హీరో' సినిమాను కొత్త వారితో సల్లూ భాయ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సూరజ్ పంచోలీ, అథియా శెట్టి బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సందర్భంగా సూరజ్ పంచోలీ తన ఇష్టాయిష్టాలను వెల్లడించాడు. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తన అభిమాన నటుడని పేర్కొన్నాడు. రణ్ వీర్ సింగ్ స్టైలింగ్ తనను ఆకట్టకుంటుందని సూరజ్ చెప్పాడు. తానింకా స్టైలింగ్ చేయలేదని, తనదైన స్టైల్ ను అభిమానులకు పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సూరజ్ తెలిపాడు. ఫ్యాషన్ పై మరింత అవగాహనకు రావాల్సి ఉందని సూరజ్ చెప్పాడు. గతంలో నటి అథియా శెట్టి షారూఖ్ తనకు ఇష్టమని చెప్పింది. కాగా, జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ ప్రధాన నిందితుడన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News