: మారుతి సుజుకిని మించిన హ్యుందాయ్!
గడచిన ఆగస్టు నెలలో మారుతి సుజుకి సాధించిన వాహన విక్రయ వృద్ధి గణాంకాలను హ్యుందాయ్ అధిగమించింది. 2014తో పోలిస్తే హ్యుందాయ్ అమ్మకాలు 48,111 యూనిట్ల నుంచి 13.5 శాతం వృద్ధితో 54,608 యూనిట్లకు పెరిగాయి. ఇండియాలో నమోదైన విక్రయాలు 20.01 శాతం పెరిగి 33,750 యూనిట్ల నుంచి 40,505 యూనిట్లకు చేరాయని, ఎగుమతులు మాత్రం 1.79 శాతం తగ్గాయని సంస్థ వివరించింది. క్రెటా, ఎలైట్ ఐ20, ఐ20 యాక్టివ్ అమ్మకాలు సంతృప్తికరంగా సాగాయని పేర్కొంది. కాగా, మారుతి సుజుకి 6 శాతానికి పైగా వాహన విక్రయ వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే.