: ఇండియాకు, చరిత్రకు మధ్య అడ్డుగా ఒకేఒక్కడు... శ్రీలంక మ్యాచ్ ఆసక్తికరం!
22 సంవత్సరాల భారత నిరీక్షణకు ఒకేఒక్కడు అడ్డంకిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నిర్ణయాత్మక మూడో టెస్టు ఆఖరి రోజు ఆటలో మిగతా వాళ్లెవ్వరూ పెద్దగా రాణించకున్నా, మ్యాథ్యూస్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మిగిలాడు. సెంచరీ సాధించిన ఊపులో మ్యాచ్ చేజారకుండా నిలిచి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే, 36 ఓవర్లలో 137 పరుగులు చేయాల్సి వుండగా, భారత్ గెలిచి చరిత్ర తిరగరాయాలంటే, 4 వికెట్లను తీయాల్సి వుంది.