: చాలెంజ్... చాలెంజ్... చాలెంజ్!: అసెంబ్లీలో గొంతు చించుకున్న జగన్
టీఆర్ఎస్ సర్కారుతో కుమ్మక్కైన జగన్, తమ నేతలను ఓటుకు నోటు కేసులో ఇరికించారని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేత జగన్ తీవ్రంగా స్పందించారు. "తాను కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా లేదా హరీష్ ను అదేదో హోటల్ లో కలిసినట్టుగా నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా... నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా? ఇందుకు సిద్ధమా? సవాల్... చాలెంజ్... చాలెంజ్... చాలెంజ్..." అంటూ పెద్దగా కేకలు వేశారు. తనకసలు స్టీఫెస్ సన్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు. "ఇంకా నయం, రేవంత్ రెడ్డిని నేనే పంపించానని, ఆయనకు డబ్బు కట్టలు నేనే ఇచ్చానని, రేవంత్ నా అనుచరుడేనని అనలేదు. అంతవరకూ సంతోషిస్తున్నా" అన్నారు. జగన్ ప్రత్యక్ష చాలెంజ్ కి చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.