: చర్చ పక్కదారి... లక్ష కోట్లన్న తెదేపా, ఓటుకు కోట్లన్న వైకాపా... రభస షురూ!


ప్రత్యేక హోదాపై చర్చ పక్కదారి పట్టింది. జగన్ గణాంకాలు సహా హోదా గురించి మాట్లాడుతున్న సమయంలో తెదేపా కావాలనే చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెదేపా మంత్రులు, చర్చ పక్కదారి పట్టేలా "లక్ష కోట్ల రూపాయలు తిని జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి విపక్ష నేతగా ఉండటం దురదృష్టం" అనడంతో గొడవ మొదలైంది. దీనికి ప్రతిగా స్పందించిన జగన్ 'ఓటుకు కోట్లు' కేసును ప్రస్తావించి, చంద్రబాబు, స్టీఫెన్ సన్ మధ్య జరిగినట్టుగా భావిస్తున్న సంభాషణ మొత్తం చదివారు. దీంతో అందరికీ అవసరమైన ప్రత్యేక హోదాపై చర్చ పక్కదారి పట్టి విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ, ఏపీ అసెంబ్లీలో రభస మొదలైంది.

  • Loading...

More Telugu News