: రూ. 2 తగ్గిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలు ధర ఇదే
నిన్న లీటరు పెట్రోలుపై రూ. 2, డీజిల్ పై 50 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోలుపై రూ. 2.16 మేరకు ప్రజలకు లబ్ధి చేకూరింది. నిన్న రాత్రి వరకూ రూ. 68.45గా ఉన్న పెట్రోలు ధర ఈ ఉదయం నుంచి రూ. 66.29కి తగ్గింది. ఇదే సమయంలో లీటరు డీజిల్ పై 56 పైసల ధర తగ్గింది. హైదరాబాద్ లో రూ. 48.99గా ఉన్న ధర రూ. 48.45కు వచ్చింది. ఇక విశాఖపట్నంలో పెట్రోలు పాత ధర రూ. 69.55 కాగా, కొత్త ధర రూ. 67.20కి తగ్గగా, డీజిల్ ధర రూ. 50.44 నుంచి రూ. 49.73కు చేరుకుంది.