: ఏడడుగులు వేస్తే, అందేంత ఎత్తులో అద్భుత విజయం!
22 సంవత్సరాల నిరీక్షణ ఫలిస్తుందా? పరిస్థితులు చూస్తే అలానే ఉంది. అయితే వరుణుడి రూపంలో దురదృష్టం వెన్నాడితే... ఏమో చెప్పలేం. విజయం సాధించి గంగూలీ, ధోనీ సాధించలేకపోయిన విజయాన్ని సాధించి చూపించాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నిర్ణయాత్మక మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 386 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచిన ఇండియా, నాలుగో రోజు 3 ప్రధాన వికెట్లు తీసి, ఇప్పటికే లంకేయుల నడ్డి విరిచింది. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు మాత్రమే కీలక ఆటగాళ్లు. వీళ్లు అసాధారణంగా పోరాడితే మాత్రం లంక కనీసం మ్యాచ్ ని డ్రా చేసుకోగలుగుతుంది. ఇక విజయానికి ఏడడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఆట తీరు ఎలా కొనసాగుతుందో ఇవాళ తేలిపోతుంది. ఈ ఏడుగురు లంక బ్యాట్స్ మన్ల వికెట్లు ఎంత త్వరగా తీస్తారన్న విషయంపైనే, భారత విజయం ఆధారపడివుంది.