: తీర్మానం కేంద్రానికి వ్యతిరేకం కాదు: కామినేని
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చేయాలనుకుంటున్న తీర్మానం కేంద్రానికి వ్యతిరేకం కాదని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా రాష్ట్ర అవసరం కాబట్టే అసెంబ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటోందని అన్నారు. ప్రత్యేకహోదాపై తీర్మానానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడితే అంతా నిశ్శబ్దంగా ఉండాలని, ముఖ్యమంత్రికి కూడా మాట్లాడే అర్హత లేదన్నట్టు జగన్ తీరు ఉందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అనుకున్నట్టు ఆడడానికి అసెంబ్లీ తోలుబొమ్మలాట కాదని మంత్రి కామినేని స్పష్టం చేశారు.