: ఇక ఐస్ క్రీం కరిగితే ఒట్టు!


ఐస్ క్రీంను తినకుండా కాసేపు అలాగే పట్టుకుని వుంటే చాలు ఇట్టే కరిగి నీరవుతుంది. వేసవి కాలంలో అయితే ఫ్రిజ్ లోంచి తీయడంతోనే అలా జ్యూస్ లా మారిపోతుంది. అలా కాకుండా... ఐస్ క్రీం కరగకుండా ఉంటే...వాహ్...ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చు కదా! అలా ఐస్ క్రీం త్వరగా కరగకుండా ఉండే పదార్థాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీఎస్1ఏ అనే ప్రొటీన్ ను ఐస్ క్రీం తయారీలో వినియోగిస్తే అది త్వరగా కరిగిపోకుండా ఉంటుందని వారు భరోసా ఇస్తున్నారు. సహజంగా లభించే ఆహారపదార్థాలు, ఉపయోగపడే బాక్టీరియాతో బీఎస్1ఏ ప్రోటీన్ తయారవుతుందని ఎడిన్ బరో యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ లో కొవ్వు శాతం కూడా తక్కువని, ఐస్ క్రీం కూడా ఎంతో మృదువుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎండా కాలంలో కూడా ఐస్ క్రీం తొందరగా కరిగిపోదని వారు చెబుతున్నారు. సో, త్వరలోనే ఇక కరిగిపోని ఐస్ క్రీంను తినొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News