: తెలంగాణలో ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంపు
తెలంగాణలో ఉపాధి హామీ పథకం పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ పథకం ద్వారా సాధారణంగా ప్రతి కుటుంబానికి గరిష్టంగా వంద రోజుల పాటు పనులు కల్పిస్తారు. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది కరవు పరిస్థితులు నెలకొనడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల సంఖ్యను 150 రోజులకు పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు అవసరమైన పనులను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.