: అమ్మో.. ఢిల్లీలో ఒంటరిగా వెళ్లను: సైనా నెహ్వాల్


దేశరాజధానిలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్న విషయం నేడు ప్రతి ఒక్కరికీ తెలుసు. వరుస అత్యాచారాలతో లైంగిక దాడుల రాజధానిగా ఢిల్లీ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. తాజాగా నాలుగు రోజుల కిందట ఢిల్లీలో 5 ఏళ్ల పసిదానిపై జరిగిన అతి కిరాతక లైంగిక దాడిని ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఖండించారు. నేటి నుంచి ఈ నెల 28 వరకూ జరగనున్న ఇండియన్ ఓపెన్ గ్రాండ్ పిక్స్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కోసం సైనా ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీలో ఒంటరిగా సంచరించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని చెప్పారు. ఢిల్లీలో ఇలా వరుసగా అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమన్నారు.

  • Loading...

More Telugu News