: చంద్రబాబు చెప్పిన మాటలు స్టేట్ మెంట్ లో ఉంటే నేను రాజీనామా చేస్తా: జగన్


లోక్ సభలో నాడు కాంగ్రెస్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు చేసిన ఆరోపణను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో లేవన్నారు. ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే బాబే రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరారు. స్టేట్ మెంట్ లో ఒకటి ఉంటే చంద్రబాబు ఇంకొకటి మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తరువాత జగన్ మీడియాతో మాట్లాడారు. సభలో తమకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవం దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు సందేహంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. ఆయన చేసేవన్నీ దిక్కుమాలిన రాజకీయాలని, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News