: తెలుగు భాష విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నాం: యార్లగడ్డ
ఏపీలో పలు విషయాల్లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ వరకు తెలుగును ద్వితీయ భాషగా బోధించాలని, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కూడా తెలుగులోనే ఉండాలని, తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. తెలుగు బోధనను మూడు నెలల్లోగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉద్యమాన్ని ఆపేస్తున్నామని యార్లగడ్డ ప్రకటించారు.