: చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: జగన్


గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి సంతాపం తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ దారుణం జరిగిపోయిందని చంద్రబాబు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు వీఐపీ ఘాట్ లో కాకుండా సాధారణ ఘాట్లో పుష్కరస్నానం ఆచరించారని అన్నారు. దీన్నంతా షూటింగ్ కూడా చేశారని చెప్పారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటమే ఇంత మంది ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News