: ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం... కానీ, ఘోరం జరిగిపోయింది: అసెంబ్లీలో చంద్రబాబు
గోదావరి పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని... అయినా ఘోరం జరిగిపోయిందని, తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటన తననెంతో బాధించిందని, ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశామని, కానీ దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని చెప్పారు. దుర్ఘటన జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్ కు స్వయంగా వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించానని తెలిపారు. పుష్కర మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో పుష్కరాల తొక్కిసలాట మృతులకు సంతాపం తెలిపే సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడుతూ చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.