: వడ్డీల భారం తగ్గే కాలం: సంకేతాలు పంపిన ఆర్బీఐ
త్వరలో జరిగే పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లు తగ్గుతాయన్న సంకేతాలు అందుతున్నాయి. ఇండియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా తగ్గుతోందని, అది వడ్డీ రేట్లను ఏ మేరకు తగ్గించేందుకు అవకాశాలు కల్పిస్తుందో పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. యూఎస్, వ్యోమింగ్ లోని జాక్సన్ హాల్ లో జరిగిన ఓ సదస్సుకు ఆయన హాజరయ్యారు. వడ్డీ రేట్లను స్థిరీకరించేందుకు యత్నిస్తున్నామని, తుది నిర్ణయానికి వచ్చే ముందు గణాంకాలను పూర్తిగా పరిశీలించాల్సి వుందని ఆయన అన్నారు. ఏ మాత్రం అవకాశాలు ఉన్నా ప్రజలపై భారం తొలగించడానికే తాము ప్రయత్నిస్తామని రాజన్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో మాదిరిగానే తాము కూడా వేచిచూసే ధోరణితో ఉన్నట్టు ఆయన తెలిపారు.