: రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీకి కల్వకుంట్ల కవిత పరామర్శ


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ అనారోగ్యంతో ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఢిల్లీలో అభిజిత్ ను కలిసిన కవిత, సువ్రా ముఖర్జీ మృతికి సంతాపం తెలిపారు. అభిజిత్ ముఖర్జీని పరామర్శించేందుకే తాను ఆయన ఇంటికి వెళ్లానని కవిత ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News