: నన్ను దేశవాళీ క్రికెట్టన్నా ఆడనివ్వండి: భట్


పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ పై వున్న ఐదేళ్ల నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుండడంతో అంతర్జాతీయ క్రికెట్ లో పునఃప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి అతనికి అనుమతి కూడా లభించింది. ఈ క్రమంలో తనకు కూడా అనుమతి ఇవ్వాలంటూ నిషేధానికి గురైన మరో క్రికెటర్ సల్మాన్ భట్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని కోరాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఐదేళ్ల నిషేధానికి గురైన మహ్మద్ అమీర్, సల్మాన్ భట్, ఆసిఫ్ లపై సెప్టెంబర్ 1తో నిషేధం తొలగిపోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం కోసం పీసీబీని భట్ కలిశాడు. కనీసం దేశవాళీ క్రికెట్టన్నా ఆడడానికి తనను అనుమతించమని భట్ కోరుతున్నాడు. 2010లో ఇంగ్లండ్ టూర్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూడడంతో అమీర్ పై ఐదేళ్ల నిషేధం విధించిన ఐసీసీ, సల్మాన్ భట్ కు ఏడేళ్లు, మహ్మద్ ఆసిఫ్ పై పదేళ్ల నిషేధం విధించింది. అనంతరం వారి శిక్షాకాలాన్ని సమీక్షించిన ఐసీసీ అందరికీ ఐదేళ్ల నిషేధం ఖరారు చేసింది. అమీర్ పై నిషేధం ఐదేళ్ల తరువాత పూర్తిగా సడలిపోతుందని తెలిపిన ఐసీసీ, మిగిలిన ఇద్దరి కెరీర్ పై పీసీబీ నిర్ణయం తీసుకోవచ్చని అప్పట్లో పేర్కొంది. మిగిలిన ఇద్దరి అంతర్జాతీయ కెరీర్ పై స్పష్టతనివ్వని ఐసీసీ, దేశవాళీ క్రికెట్ ఆడుకోవచ్చని సూచించింది. దీంతో వీరి అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై పీసీబీ చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీబీ పెద్దలను భట్ కలిశాడు. అయితే పీసీబీ ఏం చేయనుందో సెప్టెంబర్ 1న తేలిపోనుందని పీసీబీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News