: గుంటూరులో వరుస గొలుసు దొంగతనాలు!
గుంటూరు నగరంలో ఇవ్వాళ ఒక్కరోజే వరుసపెట్టి ఏడు గొలుసు దొంగతనాలు జరిగాయి. నగరంలోని పట్టాభిపురం, అరండల్ పేటలో రెండు గంటల వ్యవధిలో ఈ గొలుసుల చోరీ జరిగిందని తెలిసింది. బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఏడుగురు మహిళల మెళ్లో నుంచి 30 సవర్ల బంగారు గొలుసులను చోరీ చేశారు. ఇలా వరుస చోరీలు జరగడంపై ఫిర్యాదులందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దొంగలను పట్టుకోవడానికి వెంటనే రంగంలోకి దిగారు.