: పుజారా ఒంటరి పోరు... టెస్టుల్లో 7వ సెంచరీ నమోదు
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో చటేశ్వర్ పుజారా ఒంటరిపోరు సాగిస్తున్నాడు. ఓ వైపు టీమిండియా బ్యాట్స్ మెన్ అంతా పెవిలియన్ కు క్యూ కడుతుంటే... మరో ఎండ్ లో పాతుకుపోయిన పుజారా సెంచరీ (101) పూర్తి చేశాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్ లో 7వ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు. మరోవైపు పుజారాకు అమిత్ మిశ్రా (24) నుంచి మంచి సహకారం అందుతోంది.