: చీప్ లిక్కర్ ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేము: మంత్రి ఈటెల
తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్న చీప్ లిక్కర్ పై ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. చీప్ లిక్కర్ పై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేమని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో తాగే వారికి మద్యం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజలే తమకు అధిష్ఠానమని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని మంత్రి పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరూ ఊహించనంత జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి నిధుల కోతతో కేంద్రం చీకటి అధ్యాయానికి తెరతీసిందని, సమస్యలపై కేంద్రంతో నిరంతరం పోరాడతామని తెలిపారు. తమ షరతులకు లోబడితేనే ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.