: రాజమండ్రి పోలీస్ స్టేషన్ పై వైకాపా దాడి


ఏపీకి ప్రత్యేక హోదాపై వైకాపా చేపట్టిన బంద్ కార్యక్రమం కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. రాజమండ్రిలో వైకాపా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సమక్షంలో బంద్ జరిగింది. ఈ సందర్భంగా అప్పారావును, ఇతర వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పీఎస్ కు తరలించారు. అనంతరం, పోలీస్ స్టేషన్ కు భారీ ఎత్తున వైకాపా కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా, పోలీసులకు, వైకాపా శ్రేణులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో, కొందరు కార్యకర్తలు ఎస్ఐపై దాడి చేశారు. స్టేషన్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, పోలీస్ స్టేషన్ వద్దకు అదనపు బలగాలు రావడంతో, వైకాపా కార్యకర్తలు పరారయ్యారని సమాచారం.

  • Loading...

More Telugu News