: జమ్ముకశ్మీర్ పూల్వామాలో ప్రమాదవశాత్తు పేలిన గ్రెనేడ్
జమ్ముకశ్మీర్ లోని పూల్వామా జిల్లా సైనిక శిక్షణలో గ్రనేడ్ పేలింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది జవాన్లకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. దక్షిణ కశ్మీర్ లోని అవంతిపురా ఏరియాలో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఈ పేలుడు జరిగిందని అంచనాకు వచ్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.