: హోదా కన్నా ప్యాకేజీ గొప్పదెలా? హోదా ఇవ్వని వారు ప్యాకేజీ ఎలా ఇస్తారు?: వైకాపా ఎమ్మెల్యే రోజా


ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకొని వస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. హోదా ఇవ్వడానికే ఇష్టపడని మోదీ ప్రభుత్వం అంతకుమించిన ప్యాకేజీ ఇస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఈ ఉదయం తిరుపతిలో జరిగిన వైకాపా ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని ఢిల్లీ వెళ్లి, ఉత్తచేతులతో వెనక్కు వచ్చిన బాబు, ఇప్పుడు సిగ్గులేకుండా ప్యాకేజీలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం బాబుకే ఇష్టం లేనట్టుందని అన్నారు.

  • Loading...

More Telugu News