: నమ్మశక్యంకాని విషయం!... షీనా హత్యోదంతాన్ని పోలిన కథను మహేశ్ భట్ రాశారట!


మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్నది షీనా బోరా హత్యోదంతమే. కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జీయానే షీనాను హత్య చేసిందన్న కథనాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన డ్రామాతో కుతూహలం రేపుతోంది. అయితే, సరిగ్గా ఇదే క్రైమ్ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ కొన్ని నెలల క్రితం ఓ కథ రాసుకున్నారట. 'అబ్ రాత్ గుజర్నేవాలి హై' చిత్రాన్ని ఈ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీనిపై భట్ మాట్లాడుతూ... "ప్రస్తుతం పీటర్ ముఖర్జియా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోగలను. వాస్తవంగా చెప్పుకోవాలంటే, దీన్ని యథార్థ గాథను తలపించే కల్పన అనడం కంటే కల్పనను తలపించే యథార్థ గాథ అనడం సబబుగా ఉంటుంది" అని పేర్కొన్నారు. కాగా, ఈ కథ తన ఊహల్లోంచి పుట్టుకొచ్చిందని, అయితే, ఇలా నిజంగానే జరుగుతుందని అనుకోలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News