: ఇరాన్ తీరంలో లంగరేసిన భారత యుద్ధ నౌకలు


భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ బేట్వా, ఐఎన్ఎస్ బియాస్ యుద్ధ నౌకలు ఇరాన్ లోని బందర్-ఏ-అబ్బాస్ రేవుకు చేరుకున్నాయి. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాల నావికాదళాలు సంయుక్తంగా విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ రెండు నౌకలు ఇరాన్ తీరంలో ఐదు రోజుల పాటు ఉంటాయి. భారత నేవీ సిబ్బంది ఇరాన్ నేవీతో కలిసి సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తారు. శిక్షణ కార్యక్రమాలు, క్రీడాంశాల్లో పోటీలు కూడా ఉంటాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునే క్రమంలో ఇదో నూతన అధ్యాయంగా భావిస్తున్నారు. ఇక, ఐఎన్ఎస్ బేట్వా, ఐఎన్ఎస్ బియాస్ నౌకల విషయానికొస్తే... ఇవి బ్రహ్మపుత్ర క్లాస్ కు చెందిన గైడెడ్ మిస్సైల్ సహిత ఫ్రిగేట్లు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ నౌకల్లో స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్ అనదగ్గ అత్యున్నత స్థాయి టెక్నాలజీని ఉపయోగించారు. శత్రు భీకర ఆయుధ వ్యవస్థలను వీటిలో పొందుపరిచారు. లాంగ్ రేంజ్ సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి వ్యవస్థలు, యాంటీ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ ఫ్రిగేట్లను మరింత శక్తిమంతం చేశాయి. వీటిని దేశీయంగా నిర్మించారు.

  • Loading...

More Telugu News