: కిక్కు తలకెక్కి... పరాయి వ్యక్తి కారులో గుర్రుపెట్టిన క్రికెటర్!


జింబాబ్వే నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ గా బ్రెండన్ టేలర్ కు పేరుంది. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న నాటింగ్ హామ్ షైర్ రాయల్ లండన్ వన్డే కప్ క్వార్టర్ ఫైనల్లో డుర్హాంపై జయభేరి మోగించింది. ఆ సందర్భంగా నాటింగ్ హామ్ షైర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవం అంటే మద్యం వెల్లువెత్తడం సాధారణ విషయమే! టేలర్ కూడా పీకలదాకా తాగి, కిక్కు తలకెక్కడంతో అక్కడ కనిపించిన ఓ షెవర్లే మాటిజ్ కార్లో పడుకుని నిద్రపోయాడు. కారు సొంతదారు మైకేల్ విటేకర్ డోర్ తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎవరో వ్యక్తి కారు వెనుక సీట్లో పడుకుని గుర్రు పెడుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఓ క్రికెటర్ అని విటేకర్ కు తెలియదు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చిన తర్వాత అతడో స్టార్ క్రికెటర్ అని తెలియడంతో విటేకర్ ఆశ్చర్యపోయాడు. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ మన కార్లో పడుకుని ఉంటే ఎలా ఉంటుంది? అంటూ ఆ ఘటనను ఓ తమాషాగా పేర్కొన్నాడు. అటు, బ్రెండన్ టేలర్ కూడా జరిగిన దానికి క్షమాపణలు తెలిపి తన గౌరవం నిలుపుకున్నాడు.

  • Loading...

More Telugu News