: నితీష్ కుమార్ లా చంద్రబాబు పోరాడాలి: వాసిరెడ్డి పద్మ


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లా చంద్రబాబు పోరాడాలని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మార్మోగుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, రాయితీలు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీతోనే సరిపెట్టుకోవాలనుకోవడం దారుణమని అన్నారు. వైకాపా తలపెట్టిన రేపటి బంద్ ను అందరూ విజయవంతం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News