: చర్చకు సిద్ధం... ప్లేస్, టైం చంద్రబాబే డిసైడ్ చేయాలి: రఘువీరా
ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు విసిరిన సవాల్ కు తాను సిద్ధమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్లేస్, డేట్, టైం చంద్రబాబే డిసైడ్ చేయాలని చెప్పారు. ప్రధానికి చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏముందో తనకు తెలియదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారని... చంద్రబాబు రహస్య పాలనకు ఇది అద్దం పడుతోందని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు రాష్ట్రానికి మూడు స్మార్ట్ సిటీలే రావడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.