: బషీర్ బాగ్ ఘటనకు 15 ఏళ్లు... అమరులకు నివాళులర్పించిన వామపక్షాలు


పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా హైదరాబాదులోని బషీర్ బాగ్ వద్ద 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్షాలు చేపట్టిన ఆందోళనపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపిన ఘటనకు నేటికి 15 ఏళ్లు నిండాయి. నాటి ఆందోళనలో వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆందోళనపై భగ్గుమన్న నాటి చంద్రబాబు ప్రభుత్వం నిరసనకారులను గుర్రాలతో తొక్కించడమే కాక కాల్పులకు కూడా దిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు మృతి చెందారు. ఈ ఘటన చంద్రబాబు సర్కారుపై ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘటనకు 15 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం వామపక్షాలు ర్యాలీగా అక్కడికి తరలివచ్చి నాటి మృతులకు అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News