: 13 కార్పొరేట్లకు ఇంద్రాణి డైరెక్టర్... ముంచేసింది!... రంగంలోకి దిగిన ఎస్ఎఫ్ఐఓ


షీనా బోరా హత్యోదంతం వెలుగులోకి వచ్చిన తరువాత, ఇంద్రాణి ముఖర్జియా గురించిన ఎన్నో విషయాలు, ఆమె గతంలో జరిపిన కార్పొరేట్ బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఆమె 13 కార్పొరేట్ కంపెనీల్లో డైరెక్టర్ గా విధులు నిర్వహించి వాటిని నష్టాల్లోకి నెట్టేసి, ఆపై బాధ్యతల నుంచి తప్పుకుందట. ఈ విషయం కార్పొరేట్ భారతావనిలో సంచలనం కలిగిస్తోంది. ఆమె డైరెక్టర్ గా ఉన్న పలు కంపెనీలపై ఎఫ్ఐఎఫ్ఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) విచారణ జరుపుతోంది కూడా. 2006 నుంచి 2009 మధ్య ఆమె పలు కంపెనీల్లో డైరెక్టర్ గా చేరింది. వీటిల్లో కొన్ని పీటర్ ముఖర్జియా ప్రారంభించినవి కూడా ఉన్నాయి. 13 కంపెనీల్లో ఆమె డైరెక్టర్ గా చేరగా, 2011 ఫిబ్రవరి నాటికి 8 కంపెనీల నుంచి ఆమె తప్పుకుంది. మిగిలిన ఐదు కంపెనీల్లో మూడు తీవ్ర నష్టాలు నమోదు చేసి మూతపడ్డాయి. మిగిలిన రెండు కంపెనీలూ నేడో రేపో షట్ డౌన్ కానున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ కంపెనీల్లో కొన్ని మానవ వనరుల సేవలందించే కంపెనీలు ఉన్నాయి. 2007 ప్రారంభంలో ఇంద్రాణి గంగా ఎగ్జిక్యూటివ్ సెర్చ్, యమునా రిక్రూట్ మెంట్ సర్వీసెస్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీల్లో డైరెక్టర్ గా చేరింది. వీటిల్లో గంగా, యమునాలు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. ఐఎన్ఎక్స్ మూత పడే స్థితిలో ఉంది. పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకోవడానికి ముందు ఆమె హెచ్ఆర్ కన్సల్టెంట్ గా పనిచేసిందట. టాప్ కార్పొరేట్ క్లయింట్ల ఉద్యోగ నియామక బాధ్యతలు చేపట్టిందట. మీడియా, ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలోని పలు కంపెనీల్లో డైరెక్టర్ గా విధులు నిర్వహించింది కూడా. వాటిల్లో 9ఎక్స్ మీడియా, డైరెక్ట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ం సరస్వతి మీడియా, ఇంద్రాణి ముఖర్జియా న్యూస్, ఐఎన్ఎక్స్ మ్యూజిక్ం ఏబీసీ మూవీస్, ఐఎన్ఎక్స్ ప్రొడక్షన్స్, ఐపీఎం ఇన్ కాన్ తదితర సంస్థల్లో ఆమె ప్రాతినిధ్యం ఉంది. ఈ కంపెనీల్లో చాలా వాటిల్లో ఆమె డైరెక్టర్ గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్టు ఎఫ్ఎఫ్ఐఓ 2013లోనే విచారణ ప్రారంభించింది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ దర్యాప్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News