: ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీ ఇచ్చేయండి: పనగారియాతో వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై తొందరగా తేల్చాలని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ఢిల్లీలో నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను వెంకయ్యనాయుడు కలిశారు. 70 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీపై తేల్చాలని సూచించారు. నిధులు, హోదా, ప్యాకేజీపై స్పష్టమైన విధానం రూపొందించి, వీలైనంత త్వరగా తెలపాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయసీమలోని 7 జిల్లాలను ఆదుకునేలా ప్యాకేజీ ఉండాలని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు తదితరాలు స్పష్టం చేయాలని ఆయన పనగారియాకు సూచించారు. నాటి రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను ఆయనకు తెలిపారు. వెంకయ్యనాయుడు సూచనలపై అరవింద్ పనగారియా బాగా స్పందించారట.