: ఇకపై తనను ఎలా పిలవాలో సర్క్యులర్ జారీ చేసిన మహిళా మంత్రి


కేరళ క్యాబినెట్లోని ఏకైక మహిళా మంత్రి పీకే జయలక్ష్మికి చిక్కొచ్చి పడింది. ఇటీవలే ఆమె తన బాల్య స్నేహితుడు అనిల్ కుమార్ ను వివాహమాడారు. ఆ వివాహానికి కేరళ సీఎం వూమెన్ చాందీ, మంత్రి వర్గ సహచరులు, అధికారులు హాజరయ్యారు. అయితే, ఇప్పటికీ ఆమె పేరు ముందు 'కుమారి' అనే పేర్కొంటున్నారట. ఎంత చెప్పినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో జయలక్ష్మి అసహనానికి లోనయ్యారు. చివరికి, "నన్ను కుమారి అని పిలవొద్దు.. నాకు పెళ్లయింది, ఇకపై శ్రీమతి జయలక్ష్మి అని పిలవాలి" అంటూ ఏకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ తోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందో, లేదో చూడాలి!

  • Loading...

More Telugu News