: షీనా బోరాను హత్య ఎందుకు చేయాల్సివచ్చిందంటే...ఇదింకో కొత్తకోణం
షీనా బోరా హత్య కేసులో క్షణానికో వార్త హల్ చల్ చేస్తోంది. ఇంద్రాణి ముఖర్జియా స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకుని, కొన్నాళ్లకు తన సోదరిగా షీనా బోరాను అతనికి పరిచయం చేసింది. తర్వాత ఆయన మొదటి భార్య కుమారుడు రాహుల్ ముఖర్జియా ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. వారు పెళ్లి చేసుకుందామని భావించారు కూడా. ఇంతలో ఇంద్రాణి ముఖర్జియాకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తితో షీనా థాయ్ లాండ్ టూర్ కి వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో అతని కారణంగా గర్భవతి అయింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పింది షీనా బోరా. దీంతో ఇంద్రాణి ముఖర్జియా ఆమెపై ఆగ్రహం తెచ్చుకుని, షీనా బోరాను ప్రణాళిక ప్రకారం హత్య చేసింది. అయితే షీనా బోరాను గర్భవతిని చేసిన వ్యక్తి ఎవరు? అనేది బయటకు వెల్లడైతే కేసులో సగం చిక్కుముడులు విడిపోయినట్టేనని అంతా భావిస్తున్నారు.