: యువకుల్ని రక్షించాలనే చీప్ లిక్కర్ తెస్తున్నాం: జగదీష్ రెడ్డి
వేలాది మంది యువకుల్ని రక్షించాలనే ఉద్దేశంతోనే చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీప్ లిక్కర్ పై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సారా తాగి వేలాది మంది యువకులు చనిపోతున్నారని ఆయన చెప్పారు. దానిని దృష్టిలో పెట్టుకునే చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఓపక్క 2 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా చీప్ లిక్కర్ తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.