: చెన్నై జట్టు నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరణ


మద్రాస్ హైకోర్టులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. లోథా కమిటి తమ జట్టుపై విధించిన నిషేధంపై స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, టీఎస్ శివంగ్నానమ్ లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. చెన్నై దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న బీసీసీఐ, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News