: ధర్మవరం కోర్టులో లొంగిపోయిన నకీలీ పాస్ పుస్తకాల సూత్రధారి


అనంతపురం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల కేసులో సూత్రధారిగా ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన బత్తలపల్లి మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంగా రూ.1.13 కోట్ల విలువచేసే 17వేల నకిలీ పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వివిధ మార్గాల్లో కాజేయడం, బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు పొందడం చేశారని పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలోని ధర్మవరం, బత్తలపల్లి, ఉరవకొండ ప్రాంతాలకు సంబంధించిన 12 మంది ముఠా సభ్యులను కూడా గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా భారీ ఎత్తున నకిలీ పాస్ పుస్తకాలు తయారుచేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News