: ఇదో రకం రివర్స్ సీన్... బాలుడిని లైంగికంగా వేధించిన లేడీ టీచరుకు ఏడేళ్ల జైలుశిక్ష
విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల కేసులు నిత్యమూ చూస్తూనే ఉంటాం. కానీ, ఈ సంఘటన దానికి పూర్తి రివర్స్. 14 సంవత్సరాల బాలుడిని లోబరచుకుని, లైంగికంగా వేధిస్తూ, ఏడాదిన్నర పాటు తన కోరికలు తీర్చుకున్న ఓ టీచర్ జైలుపాలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. ఓ ఉపాధ్యాయురాలు (27) తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. 2011 నుంచి ఈ తతంగం జరుగగా, సమగ్ర విచారణ జరిపిన కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పిచ్చింది. తాను తప్పు చేశానని, క్షమించాలని సదరు లేడీ టీచర్ న్యాయమూర్తి ఎదుట వాపోవడంతో శిక్షను ఆరున్నరేళ్లకు తగ్గిస్తున్నట్టు కోర్టు తెలిపింది.