: భూమికి అతి సమీపంలోకి రానున్న అంగారకుడు


అంగారక గ్రహం భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ఎంత సమీపంలోకో తెలుసా? ప్రస్తుతం భూమికి, అంగారకుడికి మధ్య 37.8 కోట్ల కిలోమీటర్ల దూరం ఉండగా, వచ్చే సంవత్సరం మే 30న 7.52 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వస్తాడు. 2016, మే 22న భూమి, సూర్యుడు, అంగారకుడు ఒకే సరళరేఖపైకి వస్తారని, ఆ సమయంలో అంగారకుడు అత్యంత కాంతిమంతంగా కనిపిస్తాడని ప్లానెటరీ సొసైటీ ఇండియా ఫౌండర్ కార్యదర్శి ఎన్.రఘునందన్ కుమార్ వివరించారు. తన గమనంలో భాగంగా 30వ తేదీన మరింత దగ్గరికి వస్తాడని, ఈ సందర్భంగా, ఇప్పటి నుంచే విద్యార్థుల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం రోజులూ గ్రహాల స్థితిగతులపై విద్యార్థులకు వివరించనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News