: గన్ తో కాల్చి, కత్తులతో నరికి... తమిళనాడులో ముగ్గురి దారుణ హత్య


తమిళనాడులో దారుణ మారణ కాండ చోటుచేసుకుంది. కోయంబత్తూరు పరిధిలోని చింతామణిపుత్తూరు సమీపంలో చోటచేసుకున్న ఈ ఘటనలో తుపాకులు గర్జించగా, కత్తులు నెత్తుటేరును పారించాయి. పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు పాత నేరస్తులపై వారి ప్రత్యర్థులు మూకుమ్మడి దాడికి దిగారు. తొలుత తుపాకులతో కాల్పులు జరిపిన దుండగులు, ఆ తర్వాత కత్తులతో స్వైర విహారం చేశారు. ముగ్గురు బాధితులను కత్తులతో నరికేశారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీనిపై కాస్త ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

  • Loading...

More Telugu News