: తెలంగాణను కాస్త పట్టించుకోండి: కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విజ్ఞప్తి


విభజన చట్టంలో ఎన్నో హామీలు పేర్కొన్నారని, వాటిపై కేంద్రం స్పందించాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోకపోతే ఆందోళన బాటపడతామని స్పష్టం చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా తెలంగాణకు చెందిన ఇతర అంశాలపైనా కేంద్రం శ్రద్ధ వహించాలని కోరారు. ఏపీకి ఎలాంటి కేటాయింపులు, రాయితీలు అందిస్తున్నారో, తెలంగాణకూ అదే రీతిలో అందించాలని అన్నారు.

  • Loading...

More Telugu News