: ఓ యువ క్రికెటర్ ఏం కోరుకుంటాడో ద్రావిడ్ అదే ఇస్తాడు: నాయర్


గాయపడిన మురళీ విజయ్ స్థానంలో టీమిండియాలోకొచ్చిన యువకెరటం కరుణ్ నాయర్ ఇండియా-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తనలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపాడని చెబుతున్నాడు. సానుకూల దృక్పథంతో బరిలో దిగాలని ద్రావిడ్ ఎల్లప్పుడు ఉద్బోధిస్తుంటాడని వివరించాడు. "నా ఆటలో టెక్నికల్ అంశాలను మరీ ఎక్కువగా మార్చకుండానే, సరైన పంథాలో స్థైర్యం నూరిపోశాడు. ఓ యువ ఆటగాడు కోరుకునేది ఇదే. ఎక్కువగా మాట్లాడడు కానీ, స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పిస్తాడు" అని వివరించాడు. ఇక, టీమిండియాలో బెర్త్ దక్కించుకోవడం పట్ల స్పందిస్తూ, కల నిజమైందని పేర్కొన్నాడు. లభించే అవకాశాలను సద్వినియోగపర్చుకోవడంపై దృష్టి పెడతానని తెలిపాడు.

  • Loading...

More Telugu News