: జీఎస్ ఎల్వీ-డీ6 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు
జీఎస్ ఎల్వీ-డీ6 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రోజు ఉదయం 11.52 గంటల నుంచి 29 గంటల కౌంట్ డౌన్ కు మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ, లాంచ్ ఆథరైజేషన్ బోర్డులు క్లీయరెన్స్ ఇచ్చాయి. భారత్ రూపొందించిన 25వ జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ లలో జీశాట్ ను ఇస్రో రూపొందించింది. జీశాట్ సిరీస్ లో ఇది పన్నెండవది. దాని బరువు 2,176 కిలోలు. రేపు సాయంత్రం 4.52 నిమిషాలకు శ్రీహరికోట నుంచి జీశాట్-డీ6 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు.