: పవన్ కల్యాణ్ చెబితే కరెక్ట్... జగన్ చెబితే తప్పా?: కొడాలి నాని


రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూమి లాక్కోవాలని చూస్తే వైకాపా చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాజధాని నిర్మాణం జగన్ కు ఇష్టం లేదని, టీడీపీకి పేరు వస్తుందనే భావనతో జగన్ అడ్డుపడుతున్నారంటూ టీడీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబితే... ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన సూచనలను గౌరవిస్తామని టీడీపీ నేతలు అంటారని... అదే వ్యాఖ్యలు జగన్ చేస్తే మాత్రం తప్పుబడతారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News