: ఏపీలో 24 గంటల పాటు బంద్ పాటించనున్న పెట్రోల్ బంక్ డీలర్లు
ఆంధ్రప్రదేశ్ లో అదనపు వ్యాట్ పెంపుకు నిరసనగా బంద్ చేయాలని పెట్రోల్ బంక్ ల డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి బంద్ చేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న అదనపు వ్యాట్ తో తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. వ్యాట్ తక్కువగా ఉన్న పక్క రాష్ట్రాలకు వినియోగదారులు తరలిపోతుండటంతో అమ్మకాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని కోరుతున్నారు.