: పాదరక్షల్లో బంగారు బిస్కెట్లు... శంషాబాద్ విమానాశ్రయంలో పట్టివేత
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంనుంచి అనధికారికంగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారం పట్టుబడింది. ఈ ఉదయం దుబాయి నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రత్యేకంగా పరిశీలించారు. వారిద్దరి పాదరక్షల్లో కిలోన్నర బంగారం బిస్కెట్లు కనుగొన్నామని చెప్పారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.