: మావోల మెరుపు దాడి... ఒడిశాలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి, 8 మందికి గాయాలు


నిషేధిత మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. ఒడిశాలో భద్రతా బలగాలపై మెరుపు దాడికి దిగారు. ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. మరో ఎనిమిది మంది జవాన్లను గాయాలపాల్జేశారు. మల్కన్ గిరి జిల్లా జాన్ భాయ్ అటవీ ప్రాంతంలో నేటి ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మావోలు మెరుపు దాడి చేశారు. ఆ దాడితో క్షణాల్లో తేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినా అప్పటికే నష్టం జరిగిపోయింది. బీఎస్ఎఫ్ జవాన్ల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో మావోలు అడవుల్లోకి పరారయ్యారు.

  • Loading...

More Telugu News