: మళ్లీ తిరోగమనం... నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
‘డ్రాగన్’ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. మొన్న భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్లు నిన్న కాస్త కోలుకున్నట్లే కనిపించాయి. అయితే నేటి ఉదయం మళ్లీ తిరోగమనమే కనిపించింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూడగా, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇక రూపాయి మారకం విలువ కూడా 46 పైసలు క్షీణించి 66.23 పైసల వద్దకు చేరుకుంది.