: అంశాలు నాలుగు, పేజీలు 13... ఇదీ మోదీకి చంద్రబాబు అందించిన నివేదిక


ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న పొద్దంతా పేపర్లు చేతబట్టుకునే తిరిగారు. కారులో కూర్చున్నా ఆయన పేపర్లను వదల్లేదు. అసలు ఆ పేపర్లలో ఏముంది?, ప్రధాని నరేంద్ర మోదీకి అందించిన నివేదిక ఏమిటి? అనే అంశాలను పరిశీలిస్తే... మొత్తం నాలుగు అంశాలు, 13 పేజీలతో కూడిన నివేదికతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. నివేదికలోని నాలుగు అంశాలేంటంటే... ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీకి గ్రాంటు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సహాయం, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సహాయమట.

  • Loading...

More Telugu News