: అబ్బో... జహీర్ ఖాన్ తో వేగలేకపోయా!: సంగక్కర


క్రికెట్ అభిమానులకు కుమార సంగక్కర గురించి పరిచయం అవసరం లేదు. క్రీజులో కుదురుకున్నాడా? ఇక పరుగుల వర్షం కురుస్తుంది. అతన్ని అవుట్ చేయాలంటే క్లిష్టమైన బంతులేయాలి. టెస్టులాడే అన్ని దేశాలతో క్రికెట్ ఆడిన సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాజాగా రిటైర్ అయ్యాడు. ఈ సందర్భంగా సుదీర్ఘ కెరీర్ లో తనను ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి చెప్పాడు. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అత్యంత క్లిష్టమైన బౌలర్ అని సంగక్కర పేర్కొన్నాడు. జహార్ బంతులను ఎదుర్కోవడం సవాలని తెలిపాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జహీర్ ఖాన్ అని స్పష్టం చేశాడు. మరో బౌలర్ గ్రేమ్ స్వాన్ కూడా తనను బాగా ఇబ్బంది పెట్టాడని సంగ వెల్లడించాడు. అలాగే యుక్తవయసులో ఉండగా వసీం అక్రమ్ ను ఎదుర్కొన్నానని, ఆయన బౌలింగ్ శైలి అద్భుతమని సంగ పేర్కొన్నాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కొన్నానని, అతనిని ఎదుర్కోవడం కూడా కష్టంగా తోచిందని సంగక్కర కితాబునిచ్చాడు. 15 ఏళ్ల కెరీర్ లో 134 టెస్టులాడిన సంగక్కర 57 సగటుతో 12,400 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News